తొక్కిసలాట బాధితులను పరామర్శించిన చంద్రబాబు..! 10 h ago
AP: స్విమ్స్ ఆసుపత్రిలో తొక్కిసలాట బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరికాసేపట్లో తిరుపతి తొక్కిసలాటపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. తొక్కిసలాటకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సమీక్ష తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడనున్నారు.